STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance Fantasy

4  

Dinakar Reddy

Abstract Romance Fantasy

శ్రావణ మేఘం

శ్రావణ మేఘం

1 min
498

ఎందుకు నీకు శ్రావణమంటే అంతిష్టం

ఏమో

మేఘాలు కమ్ముకుంటాయనా

అవి ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నట్లు అనిపిస్తాయనా

ఏమో

చిరుజల్లులు కురుస్తాయనా

ఆ చిరు జల్లులు తెప్పించే కాఫీ సువాసనల కోసమా

అబ్బే నే కాఫీ తాగనుగా

పోనీ ఆ శ్రావణ సమీరాల కోసమా

అవి తీసుకువచ్చే చెలి కబుర్ల కోసమా

అవును

కాదు కాదు

నే చెప్పలేను

ఎందుకో తెలియదు

నాకు శ్రావణ మాసమంటే ఇష్టం

శ్రావణం గురించి వ్రాస్తూ పాత ప్రేమను మరచిపోవడానికి ప్రయత్నిస్తాను

అవి చేసిన గాయాలకు మందు దొరుకుతుందేమో అని ప్రకృతిలో వెతుక్కుంటాను

వెర్రిగా వెతుక్కుంటాను

ఇంకా వెర్రిగా

కొత్త ప్రేమలను ఆహ్వానిస్తూ ఉంటాను.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract