శిశిర ప్రేమ
శిశిర ప్రేమ
ప్రేమ ఎంత మధురం
అని పాడలేదు నేను
విరహపు వేదనను
అర్థం చేసుకున్నాను
వంచనల స్నేహాన్ని
వదులుకున్నాను
నన్ను నేను ప్రేమించేలా
చేసినందుకు నిన్ను
గౌరవిస్తాను
వసంతంతో పాటు
ఆకులు రాల్చే శిశిరాన్ని కూడా
సమంగా ప్రేమిస్తాను
ప్రేమతో జీవిస్తాను.