శిల్పమెదో
శిల్పమెదో
రాగవీణ సాక్షిగాక..మోహసుధలు రాలవులే..!
ధర్మసూక్ష్మ మందకనే..కర్మవలలు తొలగవులే..!
ఏ క్షణమున కేరెప్పలు..వాలేనో ఎవరికెరుక..
ఆశవెంట పరుగాపక..వెర్రికలలు వీడవులే..!
వింతదాహ యాతనతో..తిరుగుపక్షి మనసేకద..
జన్మగుట్టు వివరించే..మబ్బుతెఱలు ఉండవులే..!
మంచుపూల దుప్పటిలో..పుడమిగీతి విన్నావా..
అమ్మప్రేమ రుచిచూపే..తీపిసెగలు దొరకవులే..!
చెలిచెక్కిలి సోయగాలు..వర్ణించే పదములేవొ..
చెలికానికి పెదవులింట..ఏచిలుకలు పొదగవులే..!
ముత్యాలో రతనాలో..చెలినవ్వుల సమమేవో..
చెప్పగల్గు కవనాలను..కడలియలలు అల్లవులే..!

