Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Classics

5.0  

jayanth kaweeshwar

Classics

శిల్పానికి ప్రాణం వస్తే?

శిల్పానికి ప్రాణం వస్తే?

2 mins
610


శిల్పానికే ప్రాణం వస్తే ... ( వచన కవితా సౌరభ సోయగం )



జక్కన ,ఢంకన మున్నగు శిల్పుల వయ్యారాల శిల్ప వనితల సౌందర్య రస పోషణలో ,

పర్యాటకుల వీక్షణ , ఆలోచనల స్వరూపములో శిల్పాల అంతరంగముల సంభాషణలో ,

మొదటి శిల్పం : నన్ను చెక్కిన జక్కన ,నన్ను రాతి కళాత్మక నగలచే అలంకరించబడి ,తిలకించ బడుచుంటిని చెలీ ,

మరియొక శిల్పం : నేను రామ ప్ప తీర్చిదిద్దిన నాగిని, నా యోగిని ఎంతబాగుగా అలం క రించుకుంన్నామో చూడవే హలా .

మొదటి శిల్పం : చె న్నకేశవస్వామి చెంత సప్త స్వరములచే నే నాట్యము చేసేద మీ అంతరంగమున వీక్షించవే సఖీ .

మూడవ శిల్పం : మహారాష్ట్ర శిల్ప కన్యకను అజంతా శిల్ప సుందరి ని నన్ను ఏంతో సుందరంగా చిత్రించారే నెలతా

నాల్గవ శిల్పం : నేను కూడా అక్కడి దానినే , ఎల్లోరా శిల్ప మంజరిని నన్ను వీక్షించినవారు ఎన్నడూ మరచి పోలేరు కదా లలనా

ఐదవ శిల్పం : నేను స్తంభాకృతిలో ఉన్నా, మొత్తం గుడి భారాన్ని గాలిలో ఉంటూ మోస్తున్నాను లేపాక్షి లో చూ డవే వనితా

ఇప్పుడు మన అందరి గొప్పతనం తో పాటు ఇంకా చిత్ర విచిత్ర శిల్పకళా మంజరులను చూపవే చెలీ , కలయ చూద్దామా?

మెత్తటి శిల్పం ,యుద్ధానికి వెళుతున్న యోధులు , సకల జంతుజాలములు , లత పుష్పాధికములను శిలలలో మలచారే వయ్యారీ

శిల్పులు విశ్వ కర్మ , సంతతి వారు కారే ,వారే బహుముఖ ప్రజ్ఞా శాలురు , అభినవ బ్రాహ్మలు . స్థపతులే శిల్ప కళా రాజుకారే పడతీ

వస్త్రాల పైన నమూనాలు , ఆలయాల పైన నగిషీలు శిల్పుల ప్రత్యేకతలు చెప్పకనే చెబుతున్నవి , మననే వీక్షించే వీక్షకులే కాంతా

ప్రాచీన ఆలయాల పైన శిల్ప శాస్త్ర ప్రావీణ్యం , ఆరోగ్య సూచనల విన్యాసం , ఇతర శాస్త్రాల మేళవింపు కలగలిపిన విజ్ఞానమే ఇంతీ

సుందర శాస్ర విశ్లేషణం వీక్షకులకు ,పరిశోధకులకు ,భావితరాలకు ఈ రసఝరులు , సకల కళల అభివృద్ధికి జీవితానికి, ఆదర్శప్రాయం

అందుకే శిలలపై శిల్పాలు చెక్కినారూ మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు .గతం నుండి వర్తమానం పిదప భవిష్యత్తు

కాకతీయులు ,రాష్ట్ర కూటులు ,చాళుక్యులు ,చోళులు - పాండ్యులు , హొయసలులు , విజయనగర రాజులు , పల్లవులు

మొదలగు ఎన్నో రాజవంశములు చేయూతతో శిల్ప సంపదచే మిశ్రితమైన విస్తృత పరిచినారీ ఆలయాలు , కట్టడాలు .

ఎన్ని చెప్పినా , పర్యాటకులందరూ , ప్రత్యేకించి సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులు , విద్యార్థులు క్షేత్ర పర్యటనలో

గుహాలయాలు , దుర్గమ ఆలయాలు , శిల్ప సమూహములచే ఉన్న ఆలయాలు బేలూరు , హళేబీడు , ఓరుగల్లు ,అజంతా - ఎల్లోరా

మహా బలిపురం , ఖజురాహో , బేలం గుహలు మొదలైనవాటిని దర్శిస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుందే చెలీ .

ఓ శిల్ప రత్నములారా ! మీ అంతరంగ సంభాషణలు మమ్ములను ఉత్తేజ పరచు చున్నవి మీ ప్రాభవాన్నిపరిరక్షించె దమే మెల్లప్పుడూ !...

కవీశ్వర్



Rate this content
Log in

Similar telugu poem from Classics