శాంతి - అశాంతి
శాంతి - అశాంతి


శాంతి కాముకులకు లోకమంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అశాంతితో రగలి పోయే వారికి ఎక్కడా శాంతి లభించదు శాంతి, అశాంతి ఒకే నాణానికి రెండు ముఖాల వంటివి మనిషి దేనికి ఆకర్షింపబడతాడో దానికే మొగ్గు చూపుతాడు శాంతి ని కోరుకునే వారు అందరితో కలిసిమెలిసి ఉంటారు అందరినీ అభిమానించి, అందరి అభిమానాన్ని పొందుతారు అంతా నేనే, అన్నీ నేనే అనుకునే వారికి ఎవరూ తోడుండరు ఒంటరి జీవితంలో కల ఇబ్బందులతో అశాంతి పాలౌతారు వీరు ఎవరినీ నమ్మలేక, నమ్మించలేక సతమత మౌతుంటారు విశ్వశాంతి నెలకొనాలంటే శాంతి కాముకులు కావాలి అందరు.