సగంలో విందు..
సగంలో విందు..
కాల్చిన బ్రెడ్ ముక్కలు
సగం తిన్నవీ
సగం తినలేక వదిలేసినవీ
ప్లేట్లలో బిస్కట్టులు
కొత్త కేకు ముక్కలు
పళ్ల రసాలు
కొంచెం మధిర
కొంచెం మత్తు
కొంచెం చిత్తు
టేబుల్ అంచున వైన్ గ్లాసు
అక్కడక్కడా సలాడ్ మీద చల్లినప్పుడు
పక్కన పడిన మిరియాల పొడి
ఉప్పు
దూరంగా పాత పాటలు
ఫర్నేస్ లో రగులుతున్న నిప్పు కణికలు
ఆకలి కదలికలు
అతనామెను వెంబడించాడు
ఆమె ఆనవాళ్లు వదులుతూ వెళ్ళింది
ఆమెను తాకేంతలో
సగం విందు పూర్తయ్యింది
మరో సగం విందుగా అతనే మారాల్సి ఉంది
