Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varanasi Ramabrahmam

Inspirational

4  

Varanasi Ramabrahmam

Inspirational

సదా రక్ష మనకు

సదా రక్ష మనకు

1 min
23.1K


సదా రక్ష మనలకు


డా. వారణాసి రామబ్రహ్మం


మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని,

వాదాన్ని, గణించని మహమ్మారి కరోనా;


ఏ మత పెద్దలు, కుల నాయకులు, ప్రాంతీయ

వినాయకులు, సిద్ధాంత వేత్తలు, దేశాధినేతలు ముట్టుకోలేని అంటువ్యాధి కరోనా; 


ఈ తేడాలన్నీ ప్రజలను వంచించి 

నాలుగు రాళ్ళు సంపాదించు కోవడానికి తప్ప

మరెందుకూ పనికిరాని భేదాలు ;


విభజనలకు అందని పట్టించుకోని

నిర్జీవ, జీవ పరాన్నజీవి కరోనా;


రక్తం గ్రూపులు, తెలుపు, నలుపు రంగులు,

ధనవంతులు, పేదలు, మేధావులు, సామాన్యులు అని అంతరాలు చూపని 

ప్రకృతి సృష్టి కరోనా;


నియమ జీవితాలు, సంయమన ప్రవర్తనలు

లేని సంఘాల్లో అతివేగంగా అంటుకునే మహమ్మారి కరోనా;


తిండి, నడత, సమత, మమత, సౌమ్యత

తగు పాళ్ళలో లేని సమాజం; ఈ వైరస్ కు

తేలికగా పాదాక్రాంతమౌ జనాల గుంపు;


ఏదో విపత్తు వచ్చినపుడు జాగ్రత్తలు పాటించడం; ఆ విపత్తు కనుమరుగు కాగానే

విశృంఖలత్వానికి పీట వేసే సమాజం, తరుచు, ఇదో, ఇంకోటో, కలిగించే వైపరీత్యాలకు బలి అయ్యే జంతు సముదాయము, ఈ మనుష్య జాతి;


నియమ, సంయమనములు 

మాత్రమే సదా రక్ష మనలకు;


Rate this content
Log in