సదా నీ క్షేమం కోరే నేను
సదా నీ క్షేమం కోరే నేను
నా పరిచయం ఒక కలలాగే కరిగి పోవాలని కోరుకున్నా..
కానీ...
ఈ 2021 సంవత్సరం...
మన జీవితంలో చెరగని చరిత్ర లా
తీరని వ్యథలాగ మిగిలిపోయింది.
మనం కలిసి గడిపిన ప్రతిక్షణం అధ్భుతమే
నీతో మాట్లాడలేని ఈ జీవితం వ్యర్థమే
నీకు దూరంగా ఉండటం నరకమే..
నీకు నాపై కోపం బాధ విరక్తి అన్ని వచ్చాయని తెలుసు.
నాకు బాధ, విరక్తి, ఉన్నాయనే అనుకుంటున్నా.
ప్చ్ చాలా అసహనంగా ఉంది...
గుండెల్లో బాధ కన్నీటి నదిలా బయటికి వస్తుంది.
ప్రేమలో ఓడిపోయిన అసమర్థురాలిగా మిగిలిపోయా.
మనసులో ఏదో తెలియని అలజడి అర్థం కాని ఆవేదన
రకరకాల భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
ఎన్నటికీ నీ తోడు విడవక నీ దానిగా మిగిలిపోవాలనుకున్నా..
భూమి ఆకాశం ఏకం చేయాలనుకున్నా..
నిన్ను నమ్మి ఇచ్చేసా నా మనసు
లిఖించేశా నా హృదయం నీకే అంకితం అని
కడదాకా నీతోనే ఉండాలన్నుకున్నా..
కాలం ఆడిన నాటకంలో
నీతో విడివడలేక వదిలేయలేక
వెనుతిరిగి వెళ్ళలేక వెళుతున్న..
ప్రియతమా...
ఈ 2022 సంవత్సరం ఆయినా...
ఏదైనా బాధలు ఉంటే అవి నాకు
సంతోషాలన్నీ నీకు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను...
నీ ఆత్మీయులు ఆకాశమంత ప్రేమ నీకు పంచాలని ఆశిస్తాను...
సదా నీ క్షేమం కోరే నేను...
