సైరికుడు -సైనికుడు
సైరికుడు -సైనికుడు
సైరికుడు.
విత్తు చల్లిన దాదిగా బెంగపడుచు
కష్టమొచ్చునేమో యని గలత తోడ
పంట పొలములో గడుపుచు బాధ మిగుల
బ్రతుకు నీడ్చును ధరణిలో బక్క రైతు.
అన్న దాతలు కరువుతో నలమటించ
పట్ట దేమిటి? నేతలన్ బట్టి దులిపి
రైతు భారమున్ దొలఁగించి రాజ్యమందు
చట్టముల్ తీసి కొనిరండి!జనులు కదిలి.
సైరికుడు మనకిచ్చును సస్యనిధిని
మెతుకు పండించు రైతన్న మేలునెపుడు
తలచు కొన్నట్టి నేతలే దైవ సములు.//
సైనికుడు.
దేశ మాతకు బిడ్డలీ ధీరులెపుడు
వెడలు చుందురు దేహమున్ విస్మ రించి
మంచు కొండల చాటున మాటు వేయు
వైరి గణముల కూల్చుచు పట్టి తెచ్చి
దేశమాత ఋణంబును దీర్చు నట్టి
భరత సైనికులకు నిత్తు వందనంబు.
వారి త్యాగమున్ దీక్షను పౌరు లెపుడు
విస్మరించక దల్చుచు వీర వరుల
జయము కోరుచు మెల్గిన జాతి వెలుగు. /
-----------------------------
