STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

రీల్స్ హీరో కాదు, రియల్ హీరో

రీల్స్ హీరో కాదు, రియల్ హీరో

1 min
234

బాధలను తన కంఠంలోనే భరిస్తూ ఆనందాన్ని

పంచి పెట్టే శివుడు నాన్న!

తన పిల్లల దృష్టిలో శత్రువు అయినా పరవాలేదు మంచి నడవడిక నేర్పాలని తపించే తాపసి!

తన అనుభవాలకు అనురాగాన్ని జోడించి అన్నం విలువ తెలియజెప్పే అన్నదాత!

తన పిల్లలను పొగిడితే ఆయుక్షీణం అని లోలోపలే సంతోషిస్తూ నలుగురు పొగుడుతున్నప్పుడు గర్వపడే ఘనుడు!

తాను పొందలేని ఆనందాన్ని తన పిల్లల జీవితాలలో నింపాలని ఆశించే ఆశాజీవి!

తన పిల్లల ఆలింగనంలో ఆదమరచిపోతాడు నాన్న!

తన పిల్లల లో బలహీనమైన వానికి చేయూతనిచ్చి మిగతా వారిపట్ల విలన్ అయిపోతాడు నాన్న!

నాన్నంటే తెర మీద కనిపించే రీల్ హీరో కాదు

తన పిల్లలకు రోల్ మోడల్ గా నిలిచే రియల్ హీరో!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational