రగిలే జ్వాలలు
రగిలే జ్వాలలు
రగిలే జ్వాలలు..మింగుతు బ్రతికేవు..!
సహనపు ఫలములు..జగతికి పంచేవు..!
నిరుపమ మైత్రికి..గగనము నీ మది..
పతి యానతినే..మీరక కరిగేవు..!
పలుకుల నిండని..ప్రేమల కొండవె..
బిడ్డల కోసము..అసువులు పెట్టేవు..!
దేవత లెంతట..పోల్చగ అందవె..
మౌనపు వెన్నెల..నదివై మిగిలేవు..!
అమాయికతకే..రూపము చూడగ..
కర్మ చక్రమున..తియ్యగ నలిగేవు..!
గుట్టుగ బ్రతుకుట..పట్టుకు పుడితివి..
వెచ్చని దివ్వెగ..చల్లగ వెలిగేవు..!
