రెప్పవు నీవు
రెప్పవు నీవు
"నా"కంటిపాపకు రెప్పవు నీవు..!!
"నా" కన్నులు కోరే స్వప్నం నీవు..!!
"నా"అడుగులో అడుగువై నీవు..!!
"నా" అడుగులు కోరే గమ్యం నీవు..!!
"నా" గుండె చప్పుడువు
నీవు..!!
"నా"గుండెలో నిండిన రూపం నీవు..!!
"నా" చేతికి అందిన జాబిలి నీవు..!!
"ఆ" జాబిలి మాటున వెన్నెల నీవు..!!
"నా"తో నడిచే నీడవు నీవు..!!
"నా"కై వచ్చిన తోడువు నీవు..!!
మరి నేనెవరిని అని నన్ను ప్రశ్ని స్తావా...? నీవు...!!
మంచు తెరలను పక్కకి నెడుతూ నిన్నే చేరాలని ఆరాటపడుతున్న వేకువ నేను.......!!!!!

