STORYMIRROR

SRINIVAS GUDIMELLA

Drama

4  

SRINIVAS GUDIMELLA

Drama

రైతు వేదన

రైతు వేదన

1 min
351

ఆకాశానికొచ్చిందా ఆవేశం

మేఘానికొచ్చిందా రోగం

మెరుస్తుందా హర్షం

కురుస్తుందా వర్షం !!


చినుకు కోసం నేను కునుకొదిలి చూస్తున్నా

కుంగి పోయిన నేను నింగినే కంటున్నా

తాళలేని బాధలు చెప్పతరమా అన్నన్నా

ఎండిపోయిన నెల పండించగలరా ఎవరన్నా !!


సాగుతున్నవేగాని ఆగుతున్నావా

కరువు తెచ్చి నువ్వు పరువు తీస్తావా

క్షేమం తెచ్చే నువ్వు క్షామం తెస్తావా

నమ్మిన వారిని నట్టేట ముంచుతావా

మురిసిపోయేలామేము కురిసిపోరావా !!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama