STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

రాయలేని గీతం

రాయలేని గీతం

1 min
227


విస్ఫోటనాల భావ సంచలనాలు మనసుకు ఏదురీది ఏకాంత తపోవనంలో సేద దీరుతున్నాయి.


గలగలా గోదావరిలా ప్రవహించే మనసు నిశ్చలంగా స్తభించిపోయింది.


కిన్నెరసానిలా ఉరకలెత్తే భావాలు నిశ్శబ్దం అయ్యాయి.


జల జల జలపాతంలా రాలే అక్షరాల నక్షత్రాలు మానసాకాశంలో ఆవిరయిపోయి వెల వెల పోతున్నాయి.


నాలో రేగే అనంత ఆవేదనలకు అలుపే లేదు అక్షర సన్యాసం.


స్వీకరించిందేమో మనసు.


ఇక ఏ అక్షరం నాకు సహకరించనని పదాల కూర్పుకు సహాయం


చేయనంటున్నాయి.


పాటగా రాలేని హృదయం గీతాలేవి రాయలేనంటుంది....


Rate this content
Log in

Similar telugu poem from Romance