Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Ramesh Babu Kommineni

Drama

4.8  

Ramesh Babu Kommineni

Drama

రాస్తున్నా..

రాస్తున్నా..

1 min
266


ప౹౹

రాస్తున్నాలే ఈ లేఖ నిన్నేమి ఏమి అనలేక

చస్తున్నాలే సమయమే లేక విషయమేలేక ౹2౹


చ౹౹

ఎన్నిసార్లు రాశానో లెఖ్ఖించి చెప్పమంటావ

అన్నిసార్లూ జవాబివ్వకను తప్పుకుంటావ ౹2౹

మసలే మర్మం చెప్పాలని మనసే తెరిచానే

అసలే అయోమయం ఆ సంగతీ మరిచానే ౹ప౹


చ౹౹

కొత్తగా ఏదో రాయాలనీ కత్తిలా కలం పట్టా

వత్తుగా కాగితాల్నీ ఒకటిగా పేర్చి మరీకట్టా ౹2౹

ఆలోచనలన్నిటినీ ఒడిసి దొంతర కట్టి పెట్టా

యోచనలే తిరిగి జ్ఞప్తికిరాక అలా అట్టేపెట్టా ౹ప౹


చ౹౹

చెవిటివాని ముందు ఆ శంఖమే ఊదినట్లూ

అవిటి మూగోనికి అద్దెమైకు ఏర్పరచినట్లూ ౹2౹

అనిభావించి జాగుచేయకే జవాబిచ్చేందుకే

సంభావించి మరిరాయి మనసే మెచ్చేందుకే ౹ప౹


Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Drama