రాజహంస
రాజహంస
స్వప్న కాంతులు మేనుచేరగ తరలిపోయెను రాజహంస..!
ప్రేమ రాజ్యం ఏలవలెనని కదలిపోయెను రాజహంస!
గూటిపడవలొ ప్రణయతీరం చేరవలెనని తలచినంత
ప్రియునితోడా పంతమాడగ వదలిపోయెను రాజహంస!
కురులమాటున దాగిఉన్నా చంద్రబింబము సాగసులెన్నో!
యెదనుసవ్వడి చేసె సుద్దులు వెలిగిపోయెను రాజహంస!
దీపకాంతిలొ అర్ధమోమే అరసిచూడగ వేడుకవులె!
అలకలందే. చెక్కిలంతా కందిపోయెను. రాజహంస!
ప్రేమ యాత్రల ఫలితమేమో! రాగజలధిన తెలుసుకొనగ
కలలతీరం చేరవలెనని వెళ్ళిపోయెను రాజహంస....
కొలనులోనీ కలువలన్నీ చిన్నబోయెను నిన్నుచూసి,,
మబ్బుచాటున చందురూడూ, మరలిపోయెను రాజహంస!
గడియగడియకు తొందరాయే నల్లనయ్యకు ఓ శ్యామా!
తడవతడవకు రాగబంధముమురిసిపోయెను రాజహంస

