రాజేనేమో..
రాజేనేమో..


తెలుపు ఎరుపుల వర్ణ మిశ్రమంలా
గడుపుతున్న పాత కాలంలా
రహస్యాలకు ప్రతీకగా
అతను నిలిచాడు
ఆభరణాలు
వాటిని చేసిన కళాకారులు
ఎవ్వరూ నేర్వని అలంకరణలు
పట్టు వస్త్రాలు
చేతిలో చిత్రమైన ఆయుధం
ఎవ్వరి మీద ప్రయోగించారో
ఎలా అతణ్ణి చేరిందో తెలీదు
కాంతి పడని ప్రదేశంలో
ఏకాంత సమయంలో
అతను అక్కడే కూర్చున్నాడు
తరాలు వివరాలు లేకుండా పోయాయి
కారాగారాలు ఖాళీ అయ్యాయి
రాజ్యం శత్రువులకు చిక్కింది
అయినా
అతను నోరు మెదపలేదు
ఒక శిలలా
అలా ఉండిపోయాడు
రాజేనేమో అని అందరూ అనుకున్నారు