రాగం తో మోహం
రాగం తో మోహం
రాత్రి కరగనంటున్నది..రాగంతో మోహంలో..!
ఆశ అలుగనంటున్నది..మోహంతో మోహంలో..!
కోరికెంత చిలిపిదోయి..తెల్లవారనీదు బ్రతుకు..
మాట నిలువనంటున్నది..గానంతో మోహంలో..!
మరుగుతున్న మరులన్నీ..మట్టిమనసు పాత్రలోనె..
కలత చెదరనంటున్నది..కలహంతో మోహంలో..!
కలలకెంత వేడుకోయి..జన్మబంధ చిత్రమవగ..
మాయ తొలగనంటున్నది..నరకంతో మోహంలో..!
అమృత మెక్కడుంది మరి..దొరికేనా ఎఱుక లేక..
వలపు వాడనంటున్నది..దేహంతో మోహంలో..!

