STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

రాగమేదో

రాగమేదో

1 min
0

తన పెదవుల అంచులపై..రాగమేదొ పిలిచింది..!

అందమైన అందలేని..లోకమేదొ చూపింది...! 


తన తియ్యని చిరునవ్వే..ప్రేమలేఖలా తోచె..

వ్రాసి చూపలేని మధుర..భావమేదొ కురిసింది..! 


మబ్బులతో కబురులాడు..పిల్లగాలి ఏమనును.. 

ఏ కుంచెకు లొంగని ఒక..చిత్రమేదొ చేసింది..! 


అక్షరాల మధువుపంచు..మౌనమేగ అసలిల్లు.. 

ఇంద్రధనువు మది దోచే..గీతమేదొ అల్లింది..! 


కానుకైన కలలనగరి..విందులింక చెల్లులే.. 

చెప్పకుండ సత్యమైన..స్వర్గమేదొ చేర్చింది..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance