రాధా కృష్ణుల హోలీ
రాధా కృష్ణుల హోలీ
మేఘాల మాలలు ఊయలగా
సంద్రాల అంచులు పీఠముగా
పూలతల సువాసనలు స్వాగతముగా
రేపల్లె గోధూళి రంగుల హోలీ కాగా
రాధా కృష్ణులు ఆడితిరట
ప్రేమ హోలీ
ఆనందాల కేళి
చూపితిరట ఆనందము
బృందావనం అంతటా
ఆడితిరట హోలీ
ప్రేమలోని భిన్న పార్శ్వాలు తెలిపితిరట