STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

పయనం ఎటు

పయనం ఎటు

1 min
358


ఖబర్ తవ్వినవాడు వేరే మతస్థుడు అయితే ఖననం చేయవా భాయి ?

కాష్టానికి కట్టెలు అందించేవాడు వేరే కులస్తుడు అయితే దహనం చేయవా సోదరా ?


కంటనీటితో పేదవాడు అంటుకుపోయిన బిడ్డల కడుపులు చూస్తుంటే

కడుపు నిండిన కామందు కుల మత ఘర్షణలకు ఆజ్యం పోస్తుంటే


ఇంకెక్కడి మానవ లోకమిది ఇంకెక్కడి సభ్య ప్రపంచం ఇది ?

ఇంకెక్కడి మేధకు ప్రయోజనం ఇంకెక్కడి ఈ జనుల గొప్పదనం ?


చూపుకు చేరని స్వర్గం చుక్కల్లో ఎక్కడో ఉన్నదనిక్కడ

చురకత్తులతో రుధిరం కారిస్తే దారి నీకెన్నడూ దొరకదు మిత్రమా


శోకపు పునాదుల మీద నీవు కట్టాలనుకున్న భవంతి శుష్క యత్నమే

ఈ లోకంలో శాశ్వత మైనది ఏదీ లేదు నాలుగు రోజుల మజిలీనే అందరిదీ


నీవొకరికి కలిగించే దుఃఖం తిరిగి నీ ఇంటికే చేరుతుంది నిప్పు రవ్వగా

నీ పేరున ఒక మొక్క నాటు ఏదో ఒకనాడు నీడగా నిలుస్తుంది కొందరికి.


Rate this content
Log in

Similar telugu poem from Romance