పర్యావరణ గీతం - కవీశ్వర్ 11.1.
పర్యావరణ గీతం - కవీశ్వర్ 11.1.
పల్లవి : గంతులేసి కృష్ణమ్మ గల గలా పారింది - చిందులేసి గోదారి చకచకా సాగింది.
ఉరకలేసి పరుగులెత్తు నీ ఊహలే ఊతంగా - జాతికి శాంతి పథం చూపరా
నోరారా జనానికి జై కొట్టారా - || గంతులేసి ||
చరణం ౧: కొండా కోనలలో ఎక్కడో పుట్టాయి - బండ రాళ్లను సైతం పిండిగా కొట్టాయి
రెండు నూ జలనిధిలో కలిసెరా - నిండుగ జీవన పరమార్థమూ తెలిపెరా - || గంతులేసి ||
చరణం ౨: చిన్న చిన్న సన్ననీ సెలయేళ్ళూ - వన్నె చిన్నెలొలుకు ఎన్నో రంగుల నీళ్లూ
అన్నీ ఏకంగా ఒకటాయెరా - మానవాళికి ప్రగతిని తెలిపెరా తిన్నగా ఘటనా చూపెరా
|| గంతులేసి ||
చరణం ౩: ఎద పొంగే నీ ఆశలకద్దమే పట్టాయి - పదిలంగా దరిచేరే పథమే చూపెట్టాయి
అదును ఇదే మదికి సాన బెట్టారా - బెదురేల ముందడుగును వడివేయరా || గంతులేసి ||