STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

పరవశమే

పరవశమే

1 min
323

చెప్పలేని చూపరాని..నేస్తమంటె పరవశమే..!

పలుకలేని వ్రాయరాని..కావ్యమంటె పరవశమే..!


కరుణామృత రసవాహిని..తోడున్నది నీతోనే..

దాచలేని తూచరాని..భావమంటె పరవశమే..!


సుస్వరాల పాలవెల్లి..మౌనాద్భుత సుధావల్లి..

తెలుపలేని పాడరాని..రాగమంటె పరవశమే..!


చిత్రచైత్ర చైతన్యపు..గగనమల్లె అణువణువున.. 

నిలుపలేని పట్టరాని..మేఘమంటె పరవశమే..! 


చెలిచూపుల అగ్గిపూల..వానసాక్షి దొరికేనా.. 

పొందలేని పంచరాని..భోగమంటె పరవశమే..! 


వర్ణించగ చిక్కనిదే..ఎప్పటికీ చక్కనిదే.. 

మచ్చలేని మాటరాని..తత్వమంటె పరవశమే..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance