ప్రవాహం
ప్రవాహం
మనసు ఆలోచనల నిత్య ప్రవాహం
భావం దానికి అనుగుణంగా సాగే వెల్లువ
భావాలు ఒక్కోసారి ఉవ్వెత్తున
ఎగసిపడే అలలసవ్వడులు
మరోసారి గడ్డకట్టిన మంచుముక్కలు
ఇంకోసారి రసమయ రసత్వపు రసగుళికలు
ఒక్కోసారి మెరిసి తుళ్ళి పోయే మెరుపు తీగలు
అమృతత్వo నింపుకున్న పద భాండాగారాలు
మరోసారి ఉక్కిరబిక్కిరైన
సంతోష కెరటాల వెల్లువలు
మదిభావాలకు మందారాల
వన్నెలద్దె కవితా కుసుమాలు
కొన్ని భావ ప్రవాహాలు
అడ్డుకట్ట వేయలేని అనంతాoభుదులు
ప్రవాహం అంటే తనతో పాటుఎంతెంతో
పనికి రాని చెత్తను,పనికొచ్చే సాధనాలు
తనతో కలుపుకొని తెచ్చే పరవడి అది
మనిషిఅనంత ఆలోచనా స్రవంతిలో
నిలకడలేని ప్రవాహo వెంట కొట్టుకు పోతే?
నీకంటూ ఓ గుర్తింపు ఎక్కడ ఉంటుంది?
కానీ నువ్వూ..ఆ ప్రవాహపు వాలుకు
ఎదురీది నిలబడి నప్పుడే కదా
నీ వ్యక్తిత్వ పరిమళం గుప్పు మనేద

