ప్రణయకావ్వమా...
ప్రణయకావ్వమా...
మాట్లాడే కన్నులనే చూసారా ఎవరైనా.. మధువొలికే భావాలే చదివారా ఎవరైనా...
ఆనింగిన తారలకే మెరుపులద్దు చెలిచూపులు.. అచ్చెరువున చూచుకనులు గీసారా ఎవరైనా..
చందమామ మైమరపున ముగ్ధుడాయె నింగిలోన. సిరివెన్నెల తనముంగిట చల్లారా ఎవరైనా..
హృదయాలే స్పందిస్తూ జరుగుతున్న మంతనాలు. మౌనవీణ సుస్వరాలు విన్నారా ఎవరైనా...
హృదిసాక్షిగ స్వరపరిచిన కోటి రాగ కృతులెన్నో.. భాషించే మనసుకధలు వ్రాశారా ఎవరైనా...
నింగినేల కలిసినట్టు అందమైన ఊహలెన్ని? ప్రేమించే గుండెగుట్టు విప్పారా ఎవరైనా...
ప్రణయకావ్య నాయికవే గుండెగూటి దీపానివి.. సుజాతమై మెరవొద్దని చెప్తారా ఎవరైనా...
... సిరి ✍️❤️

