ప్రణయ కలహం
ప్రణయ కలహం
లలితమైన వదనాన.ఆలోచనల అభినయాన..
ఆ సైగలు తెలిపే భావం నీ గురించైతే...
మౌనమే సంగీత ధ్వనిగా మ్రోగింది...
ఆ సప్తస్వరాల సంమేళనానికి హేతువు నీ స్వరమైతే...
చిలిపి తనానికి అద్దం పట్టేలా ఉందా అల్లరితనం...
ఆ తుంటరి అద్దంలో దాగిన ప్రతిబింబం నీదైతే...
నాది అనుకునే ఆరాటం ఉవ్వెత్తున్న ఎగసి పడుతుంది...
ఆ అలల తాకిడిని నియంత్రించే సాధనం నీవైతే...
స్వచ్ఛమైన మనసులో నీకై కట్టాను ప్రణయ కంకణం...
నాతిచరామని అగ్నిహోత్రం సాక్షిగా ఒకటైనమన మూడుముళ్ళ బంధం ...
నిత్యం నెమరువేసుకోవాలి మన ప్రియ కథనం...
జీవితాంతం సాగాలి నీతో... నా...
ప్రణయ కలహం ...

