ప్రణయ దృష్టి
ప్రణయ దృష్టి


ముందుకు అలలు వలె సాగుతోంది ఈ జీవితం,
యవ్వనం చేస్తోంది జీవితానికి సుమ సుశోభితం,
అస్థిర మనసు అయ్యెను రూపసి వద్ద వశీభూతం,
అనంతరం ప్రణయ ద్రుష్టి అయ్యెను అనంతం |౧|
రూపసి పై మన్మధుడు ఇచ్చెను ప్రేమ సంకేతం,
ప్రేయసి అవమని ఇచ్చెను తన ఒక్క అభిమతం,
చూసి చూసి చేశెను అనంత అనురాగం అంకితం,
ప్రియతమ ప్రతి మాట అనిపించెను మధురగీతం |౨|
ప్రియుని కొంటెచూపు చూసి బిడియం పొందెను రూపవతి,
అల్లకల్లోల మతి నుండి మాయమయ్యెను శాంతి విశ్రాంతి,
తన అభిమాని అభిప్రాయాన్ని కన్నులతో ఇచ్చెను సమ్మతి,
పరస్పర ప్రీతితో ప్రేమజంట పొందింది ఆనంద అనుభూతి |3|