పరమపదం
పరమపదం


పరమపదం
.......................
యెదలోంచి పొంగే అనందం జానపదం
గుండెపగిలితే పొరలే ఆవేదన జానపదం
పనిలో అలుపెరుగని కూలీపలుకే జానపదం
గుడిసెలో ఆలుమగల
మాట్లాటలె జానపదం
ఆరుబయట బావామరదళ్ళ
వాదులాటలే జానపదం
తెలుగునేలపై నాల్కేదైనా
పాడేపాటే పరమపదం
గాదిరాజు మధుసూదన రాజు