STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics

4  

SATYA PAVAN GANDHAM

Classics

ప్రకృతి

ప్రకృతి

1 min
392

నేస్తమా.. ఓ ప్రకృతి నేస్తమా...


"నింగే" నీ హద్దు అంటూ ఆశగా ఆకాశానికి నిచ్చెన వేయగలవు, 

కానీ అందనంత ఎత్తులో నిల్చుంటావు.


విశాలంగా పరుచుకున్న "పుడమే" నీ సొంతం అంటూ ఊరించగలవు, 

చివరకు ఆరడుగుల గొయ్యి కి పరిమితం చేస్తావు.


నా ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో "గాలి" లా తోడుండగలవు,

ఆఖరకు నా ఆయువును నీలో ఆలింగనం చేస్తావు.


"దీపంలా" చీకటి తెరలను చీల్చూతూ వెలుగులు విరజిమ్మగలవు, 

బడబాగ్నివై వెలుగుతున్న బ్రతుకులను చీకటి పరుస్తావు.


చల్లటి "వాన జల్లులా" నా తనువును తాకుతూ సేదపరచగలవు, 

అంతలోనే ప్రకోపంతో కన్నెర్ర చేస్తూ ప్రళయాన్ని సృష్టిస్తావు.


ప్రకృతితో మమేకమైన పంచభూతాలను వర్ణించడానికి నేను కవిని కాకపోయినా..

యద మాటున దాగిన అక్షర సత్యాలు మది గూడు దాటి ఒక కవితలా వ్యక్తపరచనా..

వాటి ప్రాముఖ్యాన్ని చాటి చెప్పనా..

ప్రపంచానికి విస్తరించనా!!!



Rate this content
Log in

Similar telugu poem from Classics