ప్రకృతి
ప్రకృతి
ప్రకృతి మాట్లాడుతుంది
మనసు పలకరించినప్పుడు,
అందాల తళుకులతో
సంతోష సరాగాల పాటలే పాడుతుంది,
చిరునవ్వుల పలుకే
అందమైన జ్ఞాపకంగా మదిలో దాచుకోమంటుంది,
కాంతిరేఖ తోడుతో నీచెలిమే కోరుతుంది,
తరగని తలపులతో
కాలాన్నే మైమరిపిస్తుంది,
గుండెగుడిలో దేవతగా కొలిచేవారికే తన మనసుకథ చెబుతానంటుంది.
ప్రకృతి అందాలను అంతంచేస్తే
కడగండ్లను కానుక చేస్తానంటుంది,
మనిషి మనసులోని
ప్రకృతి ప్రేమకు సత్యభాగ్యంగా ఉంటానంటుంది,
ప్రకృతి ఆరాధనే బ్రతుకుబాటకు పూలబాట అంటుంది,
ప్రకృతిని అమ్మగా చూసుకుందాం,
సంతోష సిరుల ప్రకృతితో
కలసి సాగుదాం,
