ప్రకృతి పలకరింపు
ప్రకృతి పలకరింపు
1 min
530
చల్లగా వీస్తున్న పిల్లగాలి,
మోముని తాకుతున్న వేళ!
జల్లుగా కురుస్తున్న వానజడి,
పుడమిని చేరుతున్న వేళ!
మెల్లగా జారుతున్న రవి,
విధిని వీడుతున్న వేళ!
నల్లగా మారుతున్న నింగి,
మదిని మీటుతున్న వేళ!
రాయనా...!!
ఈ ప్రతి అనుభూతిని ఒక తియ్యటి వాక్యంలా!!
చేరదా...!!
నా ప్రతి వాక్యం నీ మనసుకి ఒక మధుర కావ్యంలా!!