ప్రకృతి దేవోభవ
ప్రకృతి దేవోభవ


సూర్యోదయం అయింది విశ్వం జనించింది
సూర్యుడి కిరణాలు భూమిని తాకగా జీవం ఆవిర్భవించింది
మేఘాలు స్వాగతం పలికాయి
సెలయేరులు హోరు అందుకున్నాయి
నదులు పొరలి ఉప్పొంగాయి
పువ్వులు పరిమళించాయి
పక్షులు పులకరించాయి
చెట్లు సందడి చేశాయి
జంతువులు సంబరాలు చేశాయి
ఇది చూసి కవి హృదయం కరిగింది
కలం కదిలింది అక్షరాలు అడిగాయి
పదములు పలికాయి
కవిత్వాలు జాలువారాయి
రచనలు వెల్లివిరిశాయి
పర్వతం చెప్పింది నాలా ఎత్తుకు ఎదగాలని
ఆకాశం అంది అందరూ తలెత్తుకొని చూడాలని
నదులు అన్నాయి ఎప్పుడు జీవితంలో ఒక చోటే ఆగిపొకని
సముద్రాలు అన్నాయి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని
తుఫాన్ చెప్పింది నాలా ధైర్యంగా శత్రువుల పై విరుచుకుపడమని
అగ్నిపర్వతాలు అన్నాయి సహనం వహిస్తే సర్వం నీ పాదాక్రాంతమేనని
చెట్లు చెప్పాయి పదిమందికి నీడని ఇవ్వమని
ఫలాలు చెప్పాయి పది మంది ఆకలి తీర్చమని
చెలిమె చెప్పింది ఒకరి దాహం తీర్చమని
గ్రద్ద అంటుంది ఉన్నత శిఖరాలకు పయనించాలని
సింహం అంటుంది ఎవరికీ భయపడవద్దని
తాబేలు అంటుంది నిదానమే ప్రధానం అని
కుక్క చెప్పింది నాలా విశ్వాసం గా ఉండమని
ఏనుగు అంది నీ కంటే బలవంతుడు లేడని
చీమలు చెప్పాయి శ్రమజీవనం శ్రేయమని
చిరుత చెప్పింది అందరి కంటే వేగంగా సాగమని
పాలపిట్ట అంది పవిత్రంగా ఉండాలని
పావురాయి చెప్పింది మంచి సందేశం పంపమని
సీతాకోకచిలుక చెప్పింది అందరి కనులకు ఆనందం కలిగించాలి అని
కోయిల చెప్పింది నీ మధుర గానంతో అందరికీ హాయిని ఇవ్వమని
అశోక చక్రం అంటుంది ధర్మో రక్షతి రక్షితః అని
వృక్షాలు చెప్పాయి వృక్షో రక్షతి రక్షితః అని
ముండకోపనిషత్తు చెప్తుంది సత్యమేవ జయతే అని
తాజ్మహల్ చెప్పింది ప్రేమకు నిదర్శనం గా నిలవామని
వేదాలు అంటున్నాయి వేదాలకు మరి రండి అని
రామాయణ మహా భారతాలు ఆన్నాయి సంసారమనే సాగరాన్ని దాటి ఇస్తానని
కానీ
మనిషికి ఉంది ఆశ
అది కలిగిస్తుంది దురాశ
రేపుతుంది మనుషుల మధ్య ఘోష
చెలరేగింది మనుషులలో ద్వేషం
అది రగిలిస్తుంది క్రోధం
అది దారి తీస్తుంది మద్యపాన సేవనం
కలుగుతుంది ఇతరులపై లోభం
అది మితిమీరిపోయి అవుతుంది వ్యామోహం
మర్చిపోతావ్ మనిషి ప్రేమ గుణం
కోల్పోతావు జీవులపై దయాగుణం
ఇవన్నీ కలిగిస్తాయి నీకు కామం
తెలియదు నీకు ఎన్నడు శాంతం
చివరి కి కారణం అవుతాయి యుద్ధం
యుద్ధంతో పరిసమాప్తి అవుతుంది మనిషి జీవనం
కాబట్టి
మనిషికి కావాలి అవసరం
దానికోసం సల్పాలి నిరంతర సాధనం
కావాలి పట్టుదల అనే ఆయుధం
శ్రమతో సిధ్దిన్చుకోవాలి జీవితంలో విజయం
అదే నీ జీవిత గమ్యానికి అసలైన సమాధానం
మనిషికి కావాలి శాంతం
దానికోసం చేయాలి ఆధ్యాత్మిక పఠనం
అందువల్ల వినాలి వేద శ్రావణం
అప్పుడే కలుగుతుంది ఆత్మజ్ఞానం
తెలుసుకుంటాడు అంతా సర్వం బ్రహ్మ మయం
దాటగలుగుతారు సుఖదుఃఖాలు సంసార భవసాగరం
పొంద గలుగుతాడు దైవ సన్నిధిలో మోక్షం
అవుతుంది మనిషి జీవనం సార్థకం
అదే మనిషి జన్మకు అర్థం పరమార్థం