STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ప్రియనేస్తమా

ప్రియనేస్తమా

1 min
0


నీ మాటయె నా పాటగ..చెల్లనిమ్ము ప్రియనేస్తం ..! 

నీ పనియే నా ద్వారా..జరగనిమ్ము ప్రియనేస్తం..! 


నీవుగాక దిక్కెవ్వరు..అందరిలో నీవేగా.. 

ఈకర్మల చెట్టుసాక్షి..ఆడనిమ్ము ప్రియనేస్తం..! 


నీ లీలలు గాకుండా..ఏమున్నవి విశ్వమందు.. 

నీ కలలో చిన్నికలను..కరగనిమ్ము ప్రియనేస్తం..! 


బాధయేదొ దు:ఖమేదొ..నిలిచేనది ఎంతసేపు.. 

ఆనందపు తీర్థముగా..మిగులనిమ్ము ప్రియనేస్తం..! 


కాలమేది కొలిచేందుకు..నీవునేను ఏకమైన.. 

ఏకాంతపు వెలుగుతేనె..పంచనిమ్ము ప్రియనేస్తం..! 


ఆయుధాల పనేముంది..శాంతినిచట నెలకొల్పగ.. 

నీ మౌనపు గగనంలో..చేరనిమ్ము ప్రియనేస్తం..!


Rate this content
Log in

Similar telugu poem from Romance