ప్రియా మనసా
ప్రియా మనసా
నా చూపులు నన్నే వెతుకుతున్నాయి
నాలో నేనెక్కడ ఉన్నానని!!
నా మౌనం నన్నే అడుగుతుంది
ఆనాటి స్వచ్ఛమైన నవ్వులు ఏవని !!
కాలం నన్ను ప్రశ్నిస్తుంది.
దేనికోసము నిన్ను నువ్వు మరచిపోయావని !!
ఎలా చెప్పగలను జీవన సంద్రంలో
ఒడ్డుకు చేరడానికి నన్ను నేను మరచిపోయానని!...