ప్రేమ తోటి
ప్రేమ తోటి
1 min
8
అవిశ్రాంత పోరాటం..జరుగుతోంది ప్రేమతోటి..!
నిప్పుపూల శ్వాస చూడ..నలుగుతోంది ప్రేమతోటి..!
చిమ్నీలా ఉన్న తనువు..చిట్లనీకు మనసు పుట్ట..
చిగురాశల సందడేమొ..పాడుతోంది ప్రేమతోటి..!
మాటవిలువ తెలిపేందుకు..మౌనవీణ సాక్షి కదా..
పెదవిచాటు గుండె చూడు..ఆడుతోంది ప్రేమతోటి..!
గాలికెగురు పతంగమే..దాటగలదు సుడిగాలులు..
ఎఱుకపూల మెఱుపుతీవ..తెల్పుతోంది ప్రేమతోటి..!
బాంబుదాడి పాలయ్యే..నేలతల్లి ఏమనునోయి..
అన్యోన్యత సాధించగ..మిగులుతోంది ప్రేమతోటి..!