రుచి రాగం (మొదటి భాగం)
రుచి రాగం (మొదటి భాగం)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
రుచిరాంగి...మెదటి భాగం...
ఎవరివే నీవు కొండమల్లే వోలె వికసించి
సన్నజాజి వోలే పరిమళిస్తున్నావు..!!
ఇందుకు కదటే యుద్దాలు జరిగిందిఇంత అందానికి కదటే
సన్యాసులు సైతం సమ్మోహనమయ్యేది
ఏ మన్మథుని ఉలి తో చెక్కాడే ఆ విధాత ఉభయ సంధ్యల
హిరణ్మయ రశ్మిని శరదృతు వెన్నెల శీతలమును ఏరుకొచ్చి,
మేళవించి, దట్టించి, మలిచాడేమోనేదిందిమి ధ్వనుల
దిమిదిమితాండవ సుగాత్రివోలెరతీఝర సరస రస శృంగిణి వోలె
పురివిప్పిన యౌవన వన మధుకమువై పుడమిన చెంగు చెంగున
తారాడు నిను జూడంగ అరువు తెచ్చు వేల నేత్రమ్ములు సరిపోవునా...!!
నిను పొందేందుకు నూఱు జన్మలు సరితూగునా..!!
అగరు ధూపము లిడు ఏకాంత వేళమల్లెలు వికసించు రసమయ
సమయమున గుప్పున గుబాళించు నీ కన్నె పరిమళమ్ములు
ఒక్కొక్కటిగా నను ఆఘ్రాణింౘు తమకమున రసరమ్యమగు నీ రూపు రేఖలు
అచంచలములగు నీ రస తనువులు వర్ణింప సఖ్యమా..!!
అధరాలు కాదే అవి సుధా రస మధుర ఫలములు
నగవుకులుకులు కాదే నీవి బిగువు బింకముల తుంటరి సిగ్గులు
తుమ్మెద మెరుపులు కాదే అవివొంపుల నడుముకు ముద్దుల వడ్డాణమ్ములు..!!!