Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

అప్పుడు

అప్పుడు

1 min
6



గుడిశతలుపు తట్టి కాస్త..దాహమడిగినాను అపుడు..! 

ఎవరు నీవు అనగ.. "నే కవినని" పలికినాను అపుడు..! 


నీవెవ్వరు అన్న ప్రశ్న..తిరిగి వచ్చె అదేమిటో.. 

బాటసారి నంటు బదులు అలా ఇచ్చినాను అపుడు..! 


మరల అదే ప్రశ్న ఎవరు..ఎవరోయీ నీవంటూ.. 

గొంతు ఆరిపోతున్నది..మొక్కివేడినాను అపుడు..! 


కన్నెగొంతులా ఉన్నది..నీవెవరో చెప్పవోయి..!? 

అమ్మా ఇన్ని నీళ్ళంటూ..ఆగి మూల్గినాను అపుడు..! 


నీవెవరో చెప్పకుండ..కుదరదనెను ఆ భగవతి.. 

ఎందులకీ పరీక్షంటు..తలచి వగచినాను అపుడు..! 


పరిమళించు వింతకాంతి..నుదుటనిండె ఓ మాధవ.. 

ఆవహించు ఆశక్తికి..శిరసు వంచినాను అపుడు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance