Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నా మనసా

నా మనసా

1 min
3


వెన్నెలంత నీటిలోకి ఒలుకుతోంది మనసా

చెరువులోన కలువభామ కులుకుతోంది మనసా 


చెలి చెక్కిట సిగ్గులతో పరవశించు నామనసే

అందమంత నాదేనని మురుస్తోంది మనసా 


నీ స్పర్శల సంతకాలు పులకరింతె నామనసుకి

నునుసిగ్గే చిరునగవుల రాలుతోంది మనసా 


నిదురరాని రేయంతా నీఊహల సందడులే

చిరునవ్వులు చిరుజల్లుగ కురుస్తోంది మనసా 


ముత్యాల్లా రాలుతున్న నీ నవ్వులు సంపదలే

ప్రతి ముత్యం నీ రూపం చూపుతోంది మనసా 


జ్ఞాపకాల భావాలే అక్షరాలై ప్రవహిస్తే

గాయాలే గేయాలై మారుతోంది మనసా 


Rate this content
Log in

Similar telugu poem from Romance