STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

కార్యదీక్ష

కార్యదీక్ష

1 min
11


వంటచేసి వడ్డించగ..కుదిరేనా కార్యదీక్ష..! 

బద్ధకాన్ని విసిరేస్తే..వెలిగేనా కార్యదీక్ష..! 


రహస్యాలు ఛేదించే..చేవ సరిగ పొందాలా.. 

ఉత్సాహం నేస్తమైన..నిండేనా కార్యదీక్ష..! 


ఆలోచన లోతులలో..ఆగుటయే ధ్యానమందు.. 

నీ మౌనపు కోవెలలో..అందేనా కార్యదీక్ష..! 


సఫలతకై శ్రమించగా..అవసరమే రాదులెమ్ము.. 

అంతరంగ శాంతమదే..పెంచేనా కార్యదీక్ష..! 


లోకాలను చుట్టేసే..వేడుకయే కలిగిందా.. 

కన్నులింటి పరాశక్తి..వరమేనా కార్యదీక్ష..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics