మల్లియలా
మల్లియలా
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
4
ఒక వాడని మల్లియలా..నవ్వేనా చెలియ..!
మనసునేలు పరిమళమై..మిగిలేనా చెలియ..!
వేదించే విరహానికి..పండుగేమి టసలు..
ఊహలోని సౌందర్యం..తానేనా చెలియ..!
వీధి వాకిలంటి మనసు..అక్షరాల తోడు..
అనునిత్యం అద్దమల్లె..ఉండేనా చెలియ..!
కాంతిపూల వానజల్లు..ప్రణయగీత మాయె..
తనువులోని అణువణువున..పొంగేనా చెలియ..!
కానలేని కాననమే..కాల్చు వేడుకేమొ..
చినుకుపూల ఎదలోయల..చేరేనా చెలియ..!