బడిబాట
బడిబాట
అందమైన మనబడికే పయనిద్దాం రారండోయ్
అక్షరాల పూదోటల విహరిద్దాం రారండోయ్
తొలకరిలో మొదలైనవి ఓనమాల సంబరాలు
చదువులతో సరస్వతిని మురిపిద్దాం రారండోయ్
అజ్ఞానపు చీకట్లను విద్యలతో తరమాలోయ్
విజ్ఞానపు వెన్నెలలే కురిపిద్దాం రారండోయ్
చిన్నారుల నవ్వులలో '' వసంతమే విరియునులే
తోటమాలి గురువైతే పులకిద్దాం రారండోయ్
లోకమునే తెలుసుకునే దారులెన్ని ఉన్నాయో
పాఠాల్లో ప్రపంచాన్ని తిలకిద్దాం రారండోయ్
నిన్నునీవు తెలుసుకునే అద్భుతాలు జరుగుతాయి
అనునిత్యం శోధనలో గమనిద్దాం రారండోయ్
ఆటలపాటల కథలే మేధను పెంచును కాదా
అలవోకగ అన్నిటిలో రాణిద్దాం రారండోయ్
విద్యను ఉచితంగానే ప్రభుత్వమే నేర్పుతోంది
మన ఊరూ మన బడిలో చదివిద్దాం రారండోయ్
ఆశయాల సాధనలో ఆశీస్సులు తీసుకోండి
శ్రీవాణీ నిలయాన్నే దర్శిద్దాం రారండో
