దివ్వమే
దివ్వమే
1 min
5
చెలిమిపూల పరిమళమై..మిగిలిపోతే దివ్యమే..!
ప్రేమగంధ రాశులేవొ..కురిసిపోతే దివ్యమే..!
నిజము కాస్త అబద్దమే..తెలియకున్నచొ మోసమే..
రాలు చినుకు సాక్షిమల్లె..వెలిగిపోతే దివ్యమే..!
తపములోన మునిగియున్న..బిందుజ్యోతివి నీవుగా..
మెఱుపువీణ రాగసుధను..వీడిపోతే దివ్యమే..!
సొంతగూడు విడచి ఎగిరే..రామచిలుకగ ఎందుకో..
మౌనగగన తీర్థమందు..కలిసిపోతే దివ్యమే..!
మరుగుమరుల యేటిగట్టు..పలకరిస్తూ ఉండులే..
మనసుమాయ వేదికనే..వదిలిపోతే దివ్యమే..!