Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

చైతన్యం

చైతన్యం

1 min
2



ఉత్సాహం ఉరకలు వేస్తుంటే 

బద్ధకం తోక ముడుచుకు పోతుంటే 

ముందుకు వేసే ప్రతి అడుగులో 

విజయపు రాగం ప్రతిధ్వనిస్తుంటే 

అచేతనమైన ఆలోచనల్లో 

చైతన్యం మొదలై 

విజయపు దారులకు ఆహ్వానం పలుకుతుంటే 

శిఖరాలు 

వాగులు 

వంకలు 

సముద్రాలు చిన్నబోతుంటే 

విజయపు ధరహాసం మోమున చేరి 

వెక్కిరించిన నోళ్లను మూయిస్తుంటే 

గంటలు, క్షణాలు మధురానుభూతులను మిగుల్చుతుంటే 


జీవితానికి కొత్త నిర్వచనాన్ని అందిస్తూ

ముళ్ల బాటను పువ్వుల బాటగా మార్చుకుని 

చిరునవ్వు తో సాగిపోతూ 

వెలుగులు పంచడమే...

అదే జీవిత పరమార్థం కాదా..


Rate this content
Log in

Similar telugu poem from Classics