STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

3  

Midhun babu

Children Stories Fantasy Children

అమ్మబాధ

అమ్మబాధ

1 min
8


అసలెవరికి అర్థమగును..చెప్పలేదు అమ్మబాధ..!

మూగవీణ వేదనయే..పాడలేదు అమ్మబాధ..! 


"దేశభాషలందు తెలుగులెస్స" నిజం ఎప్పుడటా.. 

ప్రశ్నించని ప్రశ్నయగును..పలుకలేదు అమ్మబాధ..! 


తాను పరాశక్తి సుమా..ఏ సుమములు కోరదోయి.. 

ప్రత్యక్షర మౌనసాక్షి..చూపలేదు అమ్మబాధ..! 


అంతరంగ లోకాలను..కావ్యాలుగ మలచేనా.. 

అమృత వాహినీ ప్రభయే..దాచలేదు అమ్మబాధ..! 


నీవు తపము చేయువేళ..నీలోపల పార్వతియే.. 

ఆకలిదప్పులు మరచును..మరువలేదు అమ్మబాధ..! 


కోరుకున్న ఉద్యోగము..సంపదలిడు లక్ష్మి తానె.. 

సద్వినియోగము చేయగ..తెలుపలేదు అమ్మబాధ..!


Rate this content
Log in