నా లోకం
నా లోకం
1 min
5
లోకాలను మురిపించే..నీ లోకమె నా లోకం..!
పరిమళించు నీ తియ్యని..ఆ మౌనమె నా లోకం..!
లేఖలలో వ్రాయలేని..భాష ఒకటి ఉంటుందట..
నా సంగతి నే తెలియని..అయోమయమె నా లోకం..!
నువు ఎదురుగ లేకున్నా..ఉన్నట్లే ఉందేమిటి..
నీ అల్లరి ఊయలలో..ఆనందమె నా లోకం..!
ఊహలోకి ఎందుకసలు..మరి రేపటి గొడవంతా..
విశ్వమోహ నాద్భుతమౌ..నీ హాసమె నా లోకం..!
వెర్రి మాలోకం అంటె..అదేమిటో అనుకున్నా..
గోర్వెచ్చని ఆ ముద్దుల..సందోహమె నా లోకం..!