నీ చూపుల వెన్నెల్లో
నీ చూపుల వెన్నెల్లో
1 min
4
నీ చూపుల వెన్నెలలో..నేను కరిగిపోవాలి..!
నీ సిగలో మల్లియనై..నేను నవ్వుతుండాలి..!
అలుపెరుగని ఈ పయనం..మహాప్రేమ కడలిలో..
నీవేమో నా ఒడిలో..వాలి నిదురపోవాలి..!
చీకటేమొ ఓడిపోయె..నాదరికి నీవు చేర..
నీ కాటుక కన్నులలో..నేను నాట్యమాడాలి..!
నీ అందెలు సవ్వడేల..చేయవెంత వింతయో..
నీవు నడిచి వస్తుంటే..నేను నిలిచి చూడాలి..!
కలహంసకు వినోదమే..మన అల్లరి తోటలో..
నీ మనసే సరాగాల..ఊయలొకటి వేయాలి..!
పదములేల మౌనమౌనొ..ఈపెదవుల కందునా..
నీ తలపుల కవ్వాలీ..నేను పాడుకోవాలి..!