నీ నిరీక్షణలో
నీ నిరీక్షణలో
ఆకాశమే ఇల చేరిందా !
నేల పైడి బొమ్మ కోసం !
నీ కోసం వేచిన హృదయం
నివేదన అందినదేమూ సుమా !
మనసు పరిమళించాలంటే
మౌనం వీడాలి!నీ నిరీక్షణలో
వేసారుతున్నా సాన్నిధ్యమాసన్న
మయ్యే క్షణం కోసం ఎడారి కూడా
పువ్వుల బాటగా సాగినది నీ రాకతో!
మాటలు ఆణిముత్యాలు సరాలుగా
కూర్చనా తీగలా అల్లేసుకుంటున్నావే
తొలకరి జల్లుల కోసంశిఖరాగ్రం చేరాలి
అంటే వానజల్లులో తడవాలి ఆరాలీ!
మనసెందుకో మబ్బులా తేలిపోతున్నది!
ఆమని కోయిల దరి చేరాక తలపుల్లో
వలపు పంట పండాలా పగడపు రాశికి !
జాబిలమ్మ నీలాకాశానికి మెరుపువై!
ప్రతి నిత్యం మెరిసిపోవాలనే నీలపు
రాశి అభిలాష ఆరాధిస్తున్నా !!!!
మమతానురాగాలే కానుకిద్దామని!!!!!
కాలమనే మేఘమా ఉరవకే ఓదార్పు
లాలనలో కరగాలీ నవమినాటి వసంతాలు!
శాశ్వతమయ్యేలా పున్నమి జాబిలికీ
వెన్నెలతో అభిషేకించనా !!!!!!!!