Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

లోగిలిలో

లోగిలిలో

1 min
6

నా జీవన రాగమిలా..పుస్తకాల లోగిలిలో..!

నీ ప్రేమకు అర్థమిలా..మేఘమాల లోగిలిలో..!

ప్రేమలేఖ లాగ మారి..దాగుటెలా నీ మదిలో..

ఈ జన్మకు భాగ్యమిలా..జ్ఞాపకాల లోగిలిలో..!

ప్రశ్నించే యవ్వనమే..మారేనా ఊయలగా..

కలలరాగ భావమిలా..ఆశయాల లోగిలిలో..!

విరహవీణ తంత్రులలో..అష్టమస్వర గాంధారం..

విన్నపాల వేదమిలా..విప్లవాల లోగిలిలో..!

పరిమళించు శాంతివనం..చిరునామా ఎక్కడుంది..

అపురూపత సంద్రమిలా..పరవశాల లోగిలిలో..!

Rate this content
Log in