నీ ఊహల పల్లకిలో
నీ ఊహల పల్లకిలో
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
11
నీ ఊహల పల్లకిలో వరుడెవరో తెలిసెనులే..!
పరదాలో అందాలకు రాజెవరో తెలిసెనులే..!
కన్నె మనసు తెలుసుకొనుటకన్న కష్ట మింకేమిటి..!?
నవ్వని ఆ పెదవుల కథ ప్రియుడెవరో తెలిసెనులే..!
ఆభరణా లెన్నున్నా అలంకార మౌతాయా..!?
నీ కన్నుల కాటుకలకు విభుడెవరో తెలిసెనులే..!
రసికతయే కరువైతే సిందూరపు వెన్నెలెచట..!?
నీ బంగరు గాజుల సిరి మరుడెవరో తెలిసెనులే..!
కలలుగనే యవ్వనాల వనరాణికి నెచ్చెలివే..!
నీ మొక్కెర సాక్షియైన సఖుడెవరో తెలిసెనులే..!