STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

3.8  

Ramesh Babu Kommineni

Romance

పరువం

పరువం

1 min
23.8K


ప౹౹ కనుచూపుల స్వాగతానికి కలవరమెందుకు కన్నెమదిలో స్వగతానికి సంకేతమైనందుకా ౹2౹


చ౹౹ ఆ బిగువ సడలని బింకమే బీద పడనీదుగా ఎగువ వడలని పొంకమే ఎద తిరుగనీదుగా ౹2౹


ఎగసేపడే అందాలకు ఎరుగని పందేలుకదా సొగసేచేసే విందులకు విరామమే లేదు కదా


౹ప౹ చ౹౹ ఈడులోన విభ్రాంతికి వివరము తెలియునా తోడులోన తొందరకు తోడ్పాటూ కలియునా ౹2౹


కలిసిపోయే మనసులకు కాఠిన్యము లేదులే తెలిసిపోయిన తెరువరి ఆ తెగింపు కోరడులే


౹ప౹ చ౹౹ వివరించి ఎడదపాట్లు కల్పించి ప్రేమకు చోట్లు సవరించి సమయాన్ని తేవద్దే సరసానికి చేట్లు ౹2౹


ముసిమిలో ముఛ్చట్లే మూడుపొద్దుల తీరవు పసిమి పరువానికి పరవళ్ళు ఎన్నటికి ఆగవు ౹ప౹


Rate this content
Log in